Home తాజా వార్తలు నేడే జరగబోయే గ్రామీణ భారత్ బంద్ ని విజయవంతం చేయండి

నేడే జరగబోయే గ్రామీణ భారత్ బంద్ ని విజయవంతం చేయండి

by Telangana Express

కార్మిక సంఘం నాయకులు లక్ష్మీకాంత్

మంచిర్యాల, ఫిబ్రవరి 15, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నేడే దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ ని విజయవంతం చేయండని కరపత్రాలను ఆవిష్కరిస్తూ గురువారం కార్మికుల సంఘం నాయకులు లక్ష్మీకాంత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. అచ్చా దిన్, విశ్వ గురు, ఆత్మనిర్బార్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చిన ఏమి ఓరగలేదు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, హామీ ఇచ్చినా కూడా దానిని అమలు జరపలేదు. ప్రపంచంలోనే భారత్ ఆకలిలో 111 స్థానంలో ఉంది, మానవ అభివృద్ధిలో 132వ స్థానంలో ఉంది. మోడీ ప్రభుత్వం వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయి, పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు దిగజారిపోయాని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కారణంగా దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు అధిక సంఖ్యలో కార్మికులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment