Home తాజా వార్తలు సీఎం కప్ మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలో మొదటి స్థానం ప్రథమ స్థానం కైవసం చేసుకున్న లోకేశ్వరం విద్యార్థులు విద్యార్థినిలు టీవీ

సీఎం కప్ మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలో మొదటి స్థానం ప్రథమ స్థానం కైవసం చేసుకున్న లోకేశ్వరం విద్యార్థులు విద్యార్థినిలు టీవీ

by Telangana Express

లోకేశ్వరం డిసెంబర్ 11
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా క్రీడాకారులను వెలికితీసేందుకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్-2024 పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ పోటీలు ప్రారంభం కాగా.. గ్రామీణ స్థాయిలో ముగిశాయి
మంగళవారం నుంచి రెండు రోజుల పాటు మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మండలంలోని గడ్చండా జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన సిఎం కప్ పోటీలో లోకేశ్వరంకు చెందిన విద్యార్థులు కబడ్డీ, పుట్ బాల్ పోటీలో ప్రతిభ కనబరిచి మొదటి స్థానం కెప్టెన్ కార్తీక్, శ్యామ్, శరత్, శ్రీకాంత్, అభినయ్, నవనీత్, కెప్టెన్ నవీన్, రవి, సందీప్, అనిల్, సాయికుమార్, కార్తీక్, శరత్, మరియు ప్రథమ స్థానం కెప్టెన్ శ్రీలత,మంజుల,రజిత, కళ్యాణి, సుజాత, కైవసం చేసుకున్న వీరిని తహసీల్దార్ మోతిరాం, ఎంపిడిఓ వెంకట రమేష్, అభినందించారు అనంతరం లోకేశ్వరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రెటరీ గంధం వినయ్ సాయి, లక్ష్మణ్, వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు
గ్రామ, మండల స్థాయిలలో ప్రతిభ చూపిన వారికి జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుంచి 21, అందులోనూ ఎంపికైన వారికి రాష్ట్రస్థాయిలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల రెండు వరకు పోటీలు జరిగుతాయని అధికారులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment