Home తాజా వార్తలు పెన్షనర్ల సంఘ భవనంలో కుటుంబ పెన్షన్ దారుల లైఫ్ సర్టిఫికేట్ సేవలు…. విశ్రాంత పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షులు కిష్టయ్య

పెన్షనర్ల సంఘ భవనంలో కుటుంబ పెన్షన్ దారుల లైఫ్ సర్టిఫికేట్ సేవలు…. విశ్రాంత పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షులు కిష్టయ్య

by Telangana Express

ఎల్లారెడ్డి, జనవరి 18,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికేట్ ను ఆన్లైన్ లో నమోదు చేసే సేవలను, గురువారం ఎల్లారెడ్డి మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో మొబైల్ తో టి పోలియో ఆప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అద్యక్షులు ఆకుల కిష్టయ్య తెలిపారు. ఈ సందర్భంగా సంఘం భవనంలో కుటుంబ పెన్షన్ దారులకు విశ్రాంత ఉద్యోగుల సంఘం కోశాధికారి పటేల్ నర్సింహ రావు తన మొబైల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ను నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ…. కుటుంబ పెన్షన్ దారులు, విశ్రాంత ఉద్యోగులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ ను ఎస్టీఓ కార్యాలయంలో అందజేసే వారని, దూర ప్రాంతాలలో ఉన్న వారు సమీప మీ సేవా కేంద్రాల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ లను ఆన్లైన్ లో నమోదు చేసుకునే వారని, మీ సేవ కేంద్రాలకు వెల్లలేని వయసు పైబడిన వారికి పట్టణంలో ఉన్నటువంటి కుటుంబ పెన్షనర్ల ఇంటి వద్దకు వెళ్ళి మొబైల్ ఫోన్ ద్వారా పెన్షన్ ఐడి నంబర్, ఫించన్ దారుల ఫోటో ను అప్లోడ్ చేసి ఆన్లైన్ లో నమోదు చేస్తూ సేవలు అందించడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సైతం పెన్షన్ దారులకు అందుబాటులో ఉండి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ నమోదు సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి విశ్రాంత ఉద్యోగి, కుటుంబ పెన్షన్ దారులు తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్లను ఫిబ్రవరి నెలాఖరులోగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు లైఫ్ సర్టిఫికేట్ నమోదు చేసుకొని వారి యొక్క మార్చి నెల పెన్షన్ నిలిపి వేయడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అసోసియేట్ అధ్యక్షులు గడ్డం బాల్ రెడ్డి, కుటుంబ పెన్షన్ దారులు తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment