దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏబిసిడి వర్గీకరణ లో మహాసభలో పాల్గొననున్న మోడీ మరియు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
చేగుంట నవంబర్ 9 తెలంగాణ ఎక్స్ ప్రెస్
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి మాదిగ సోదరులు గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ చివరి దశలో ఉన్నందున హైదరాబాదులో నిర్వహించే మాదిగల గర్జన సభకు ముఖ్య అతిథులుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసి అన్ని రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ వల్ల ఉపయోగాలను ప్రతి ఒక్కరికి తెలియపరచి ఏబిసిడి వర్గీకరణ అయ్యేవిధంగా చూస్తానని తెలిపారు అదేవిధంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్థాపించిన ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఎంతోమంది రాజకీయ నాయకులు రాజకీయ జీవితాన్ని పంపకం గడుపుకుంటూ వెళ్తున్నారు కానీ దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఏ బి సి డి వర్గీకరణకు చివరి దశలో ఉన్నందున వారు సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు 11 తారీఖు జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి రావాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ పెంటయ్య బాల పోచయ్య మండల అధ్యక్షులు సాయిబాబా తదితరులు ముఖ్య నాయకులు పాల్గొని కరపత్రం విడుదల చేశారు.