Home తాజా వార్తలు ఆర్థిక సాహయం చేసి మానవత్వం చాటుకుందాం

ఆర్థిక సాహయం చేసి మానవత్వం చాటుకుందాం

by Telangana Express

ఉపాధ్యాయుల ప్రాణాలను కాపాడుదాం

మంచిర్యాల, మార్చి 10, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కిష్ణాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు నిర్వహిస్తున్న ముంజం మల్లేష్ కు గత నెల 26న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైనాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కోమాలో ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు మల్లేష్ వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఇదివరకు 15 లక్షల వరకు హాస్పటల్ చికిత్స కోసం ఖర్చు చేయడం జరిగింది. కిష్టాపూర్
ప్రధానోపాధ్యాయులు గా ముంజం మల్లేష్ భాద్యతలను నిర్వర్తించి అ పాఠశాలను, విద్యార్థులను ఎన్ఎమ్ఎమ్ఎస్, ఎస్ఎస్ సి, మేధా చారిటబుల్ ట్రస్ట్, సిఓఇ పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలపటం కోసం అహోరాత్రులు శ్రమించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కోమాలో ఉన్న ప్రధానోపాధ్యాయులు మల్లేష్ ఆర్థిక పరిస్థితి అంత భాగా లేని కారణంగా, అ కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో ఉంది. దయచేసి అతని ఆరోగ్యం మెరుగవ్వటానికి ఉదారతతో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయండి. ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఉపాధ్యాయునికి తలో కొంత సహాయం చేసి ప్రధానోపాధ్యాయులైనా మల్లేష్ ప్రాణాలను కాపాడాండి. ఆర్థిక సాయం చేసేవారు ఈ దిగువ చిరునామా కు, ఎదులపురం గోవర్ధన చారి, అకౌంట్ నెంబర్ 50100135732661 ఐఎఫ్ఎస్ సి, బ్రాంచ్ లక్షెట్టిపేట్, ఫోన్, గూగుల్ పే
9490010292 దాతలు ఎవరైనా ఉంటే అందజేయగలరు.

You may also like

Leave a Comment