Home తాజా వార్తలు ఎల్లారెడ్డి మున్సిపాలిటిని అభివృద్ధి చేద్దాం…2024- 25 కు గాను 533.70 లక్షల అంచనా ఆదాయం…- ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు

ఎల్లారెడ్డి మున్సిపాలిటిని అభివృద్ధి చేద్దాం…2024- 25 కు గాను 533.70 లక్షల అంచనా ఆదాయం…- ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు

by Telangana Express

ఎల్లారెడ్డి, మార్చి 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మున్సిపాలిటీని పాలక వర్గ సభ్యుల సహకారంతో కలిసి కట్టుగా మరింత అభివృద్ధి చేసుకుందామని, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశం హాల్లో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. ముందుగా మున్సిపల్ మేనేజర్ వాసంతి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలను మున్సిపల్ పాలక వర్గ సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ది కోసం సమిష్టిగా కృషి చేసి, మరింత అభివృద్ధి చెందేవిధంగా ప్రణాళికలు తయారు చేసుకుని, స్వచ్ఛ, ఆదర్శ మున్సిపాలిటీగా మార్చేందు కోసం కృషి చేద్దాం అని అన్నారు. ఇందు కోసం 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను 533.70 లక్షల (ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల డెబ్బై వేల) అంచనా ఆదాయ బడ్జెట్ కు మున్సిపల్ పాలక వర్గ సభ్యులు అంత కలిసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, వైస్ చైర్మన్ ముస్త్యాల సుజాత, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ మేనేజర్ వాసంతి, మున్సిపల్ ఎ ఈ వినోద్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎడ్ల కిషన్, తస్లిమ్ జహాన్, కౌన్సిలర్లు పద్మ శ్రీకాంత్, నీలకంఠం, భుంగారి రాము, అల్లం శ్రీను, ఎరుకల సాయులు, నునుగొండ భూదేవి, గాదె విజయలక్ష్మి, మంచిర్యాల మహేశ్వరి, సంగని బాలమని పోచయ్య, జీనత్ సుల్తానా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment