న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 27/12/24
భైంసా పట్టణం లోని
హైదరాబాద్ లో జరిగే న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ నిర్మల్ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి జే రాజు పిలుపునిచ్చారు. డిసెంబరు 28 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ పోస్టర్ ఆవిష్కరణలో మాట్లాడుతూ ఈ సభకు ప్రధాన వక్తగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ధర్శన్ సింగ్ ఖట్కర్ హాజరైతారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అమలు చేస్తూ ప్రజల మధ్య ఉన్న సోదర భావాన్ని దెబ్బతీస్తుందన్నారు. గత పది ఏళ్ల కాలంగా పచ్చి కార్పోరేట్ విధానాలను అవలంబిస్తూ దేశ సహజ సంపదనంతా దోచిపెట్టిందన్నారు. దేశంలో ఆకలి, అసమానతలు, నిరుద్యోగం, హక్కుల హనన, ప్రశ్నించే వారిని అణిచివేయడం, నిత్య కృత్యంగా జరుగుతుందన్నారు. ఇలాంటి.కష్ట కాలంలో దేశంలో ఉన్న విప్లవకారులు అంతా ఐక్యమై ప్రజల తరఫున పోరాటం చేయాలన్నారు. నక్సల్ బరి, శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాల ప్రేరణతో ఏర్పడిన న్యూడెమోక్రసీ పార్టీ ప్రజల తరపున పోరాడిన ఘనమైన చరిత్ర- ఉందన్నారు. అనేకమంది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని కాంక్షించారన్నారు. అమరవీరుల ఆశయ సాధనకు రెండు న్యూడెమోక్రసీ పార్టీలు ఐక్యమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో విప్లవకారులందరినీ ఐక్యం చేసి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నిర్మల్ డివిజన్ సెక్రటరీ ఎం హరిత, నాయకులు గంగాధర్,జైభీమ్, పాల్గొన్నారు.
