మంచిర్యాల, ఫిబ్రవరి 21,( తెలంగాణ ఎక్స్ ప్రెస్): మధ్యతరగతి ప్రజల కోసం సుప్రీంకోర్టు ఎం ఐ జి పథకం ప్రవేశపెట్టింది. మధ్యతరగతి ప్రజలు ఇకముందు సుప్రీంకోర్టులో కేసు వేసుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయని భయపడవలసిన అవసరం లేదు. ఈ పథకం పేరు మధ్య ఆదాయ వర్గం ఎం ఐ జి పథకంగా పేరు నమోదు చేశారు. ఈ పథకం ప్రకారం సుప్రీంకోర్టులో కేసు వేసుకోవాలంటే సంవత్సరం ఆదాయం 80 వేల నుండి ఒక లక్ష 50 వేల లోపు కలిగిన వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు. మధ్యతరగతి వారి కోసం సుప్రీంకోర్టు మధ్య ఆదాయ వర్గ న్యాయ సహాయ సొసైటీని ఏర్పాటు చేసింది. భారతదేశ ప్రధానమంత్రి న్యాయమూర్తి ప్యాట్రన్ ఇన్ భీమ్ గా అట్టర్నీ జనరల్ ఎక్స్ ఆఫీ పియెా వైస్ ప్రెసిడెంట్ గా సోలి సిట్టర్ జనరల్ గౌరవ కార్యదర్శిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సభ్యులుగాను ఉంటారు. సుప్రీంకోర్టులో న్యాయం పొందే మధ్యతరగతి ప్రజలు 500 రూపాయలు రుసుమూ కట్టవలసి ఉంటుంది.
మధ్యతరగతి ప్రజలు సొసైటీకి, 750 లను సర్వీస్ చార్జి కింద చెల్లించాలి. అనంతరం మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు ధారు సొసైటీలో దాఖలు చేయాలి. లాయరు మధ్యతరగతి దరఖాస్తు పూర్తి సమాచార వివరాలు (ఏఓఆర్)కు పంపిస్తారు. మధ్యతరగతి దరఖాస్తుదారు వేసిన కేసు విచారణకు అర్హమైనదని ఏఓఆర్ భావిస్తే, కోర్టులో వాదనలు వినిపించేందుకు ఒక లాయర్ కి బాధ్యతలను సొసైటీ అప్పగిస్తుంది. దరఖాస్తు న్యాయ వివాదా నికి అర్హమైనది కాదని ఏఓఆర్ నిర్ణయిస్తే, సర్వీస్ ఛార్జి కింద మధ్యతరగతి దరఖాస్తు ధారు నుంచి వసూలు చేసిన 750 లను మినహాయించుకుని మిగతా సొమ్మును వెనక్కు ఇచ్చేస్తారు. సొసైటీ ద్వారా సుప్రీంకోర్టులో దాఖలయ్యే కేసులు సాధారణ కేసుల్లాగే విచారణకు వస్తాయి. తీర్పు ఎలా వస్తుందని మధ్యతరగతి దరఖాస్తుదారు భావిస్తే, తీర్పు ఎలా వచ్చినా దాంతో సొసైటీకి సంబంధం ఉండదు. కేసు దాఖలు చేయటం, లాయర్ ని ఎంపిక చేసుకోవటంలో మాత్రమే సొసైటీ సహకరిస్తుంది. సుప్రీంకోర్టును ఆశ్రయించటం పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం ప్రత్యేక పథకం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిన నేపథ్యంలో, సాధారణ ఫీజుతోనే తమ వివాదాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి న్యాయం పొందే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలన్నదే సొసైటీ ఉద్దేశం. కేసును చేపట్టిన న్యాయవాది నిర్లక్ష్యం వహిస్తున్నాడని నిరూపణ అయితే, సుప్రీం కోర్టు సదరు న్యాయవాదిని పథకం ప్యానెల్ నుంచి తొలగిస్తుంది. ఈ పథ కానికి సంబంధించిన పూర్తి వివరాలు, సెరో సమగ్ర స్వరూపం ద్వారా మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేస్తుంది.
మధ్యతరగతి ప్రజల కోసం సుప్రీంకోర్టు ఎంఐజి పథకం ప్రారంభం
46