వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ
వీణవంక పోలీస్ స్టేషన్లో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు ..
వీణవంక, జనవరి 18( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పోలీస్ స్టేషన్లో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. వీణవంక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో భూతగాదాలు, ఆస్తి పంపకం తగాదాలు, డబ్బు సంబంధ కేసులు, పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవని ఏర్పాటు చేశారు. ఇటీవల వీణవంక పోలీస్ స్టేషన్ కి విచ్చేసిన , ఎస్సై బి వంశీకృష్ణ మండలంలోని రోజురోజుకు పెరుగుతున్న కేసులపై దృష్టి కేంద్రీకరించి, ఎక్కువ గ్రామాల నుండి భూ సమస్యలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక సమస్యలపై, ఎక్కువగా కేసులు వస్తున్నందున,ఇట్టి సమస్యలపై సంబంధిత ఆఫీసులలో, లేదా కోర్టుల్లో పరిష్కరించుకోవాలని కోరుతూ, పోలీస్ స్టేషన్ లో పరిష్కరించబడవంటూ , ఎస్సై బి వంశీకృష్ణ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.