Home తాజా వార్తలు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు.. ఉచిత అల్పాహార వితరణ

కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు.. ఉచిత అల్పాహార వితరణ

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 2 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ, మీల్స్ ఆన్ విల్స్ ప్రోగ్రాం చైర్మన్ మా శెట్టి శ్రీనివాస్ డైమండ్ నేతృత్వంలో మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే సహాయకులకు నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ విల్స్
420వ రోజుకు మంగళవారం చేరుకుంది. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొదిలే వెంకన్న యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే సహాయకులకు ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని దాతగా వ్యవహరించి సుమారు రెండు వందల మందికి.

పండ్లు పంపిణీ చేశారు, కేక్ కట్ చేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి నారాయణ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, రాజశేఖర్ క్రాంతి, కిరణ్ అజయ్, తోపాటు లైన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్, బి.ఎం.నాయుడు, సింగు రాంబాబు,వీరన్న,ఇంద్ర, నాగు నాయక్, సామ శ్రీనివాస్, గట్టు వెంకటేశ్వర్లు, వాలంటరీ రఫి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment