ఉత్సవంలో కుటుంంబ సమేతంగా పాల్గొన్న యాదగిరిగుట్ట ఆలయ ఈఓ రామక్రిష్ణ…
ఘట్కేసర్,జనవరి 12(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని శ్రీగోదాసమేత రంగనాయక స్వామి దేవాలయంలో ధనుర్మాసపూజల్లో భాగంగా కుడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో మంగళ హరతులతో వచ్చి కుడారై ఉత్సవంలో పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిత్యం అర్చన, తిరుప్పావై పారాయణం తదితర పూజలను ధర్మకర్తలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసం ప్రారంభం నుండి అనునిత్యం తెల్లవారు జామునే స్వామి వారి పాదాల ముందు వేస్తున్న రంగురంగుల పువ్వులతో వేస్తున్న స్వామి వారి,అమ్మవారి ఆకృతులు,రంగవల్లులు భక్తులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎదులాబాద్ గ్రామస్తులే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులు గోదారంగనాయకస్వామిని దర్శించుకొని, అనంతరం 108 పాత్రల్లో అమ్మవారికి నివేదించిన నైవేద్యం స్వీకరించారు.
కుడారై ఉత్సవంలో కుటుంంబ సపరివార సమేతంగా యాదగిరిగుట్ట ఆలయ ఈఓ రామక్రిష్ణ పాల్గొని ఆండాల్ రంగనాధులను దర్శించుకొని ప్రతేక పూజలు చేశారు, ఈ మేరకు ఆలయ అర్చకులు శేషాచార్యులు, అచ్చుతా ఆచార్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి, స్వామి వారి తీర్ద ప్రసాదాలు అందచేశారు.ఆలయ ధర్మ కర్త లక్ష్మణా చార్యుల దంపతులను ఘజమాలతో భక్తులు కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
ధనుర్మాసపూజల్లో భాగంగా 15న ఉదయం10.30 గంటలకి శ్రీగోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవం,సాయంత్రం భర్తనాట్యం, 16 న సాయంత్రం అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల్లో ఒకరైన లక్ష్మణాచార్యులు,గోవిందాచార్యులు తెలిపారు.