Home తాజా వార్తలు కొరవడిననిగాముధోల్ ఎస్సై నియమించేది ఎన్నడో….? భద్రత పర్యవేక్షించే అధికారి లేకపోవడం పై ఆంతర్యం ఏమిటి..?

కొరవడిననిగాముధోల్ ఎస్సై నియమించేది ఎన్నడో….? భద్రత పర్యవేక్షించే అధికారి లేకపోవడం పై ఆంతర్యం ఏమిటి..?

by Telangana Express

ముధోల్:11డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ పో లీస్ స్టేషన్ లో స్టేషన్ అధికారి (ఎస్సై) లేకపోవడంతో గత నెల రోజుల నుండి భద్రత సన్నగిల్లుతుంది. వివరాల్లోకి వెళితే ముధోల్ తో పాటు ఆయా గ్రా మాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారి (ఎస్సై) నెల రోజులు నుండి పోలీస్ స్టేషన్ లో నియమించకపోవ డంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముధోల్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో నిత్యం రేషన్ బియ్యం, మద్యం రవాణా వి చ్చల విడిగా కొనసాగుతుంది. దీంతో భద్రత పర్యవేక్షించాల్సిన అధికారి లేక పోవడంతో యదేచ్చగా అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా అన్నట్టుగా కొనసాగుతుంది . దీంతో పాటు స్థానిక పోలీస్ కార్యాలయం ముందు నుండే రాత్రుల్లో మొరం మా ఫియా యదేచ్చగా తరలించుకొని సొ మ్ము చేసుకుంటున్నారు. ఏది ఏమై నప్పటికీ ముధోల్ నియోజకవర్గ పో లీస్ సర్కిల్ కార్యాలయంలో శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన అధికా రిని (ఎస్సై)ని వెంటనే నియమించా లని స్థానికులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment