Home తాజా వార్తలు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

by Telangana Express

కామారెడ్డి జిల్లా/ బాన్సువాడ నియోజకవర్గo (తెలంగాణ ఎక్స్) ప్రెస్ ఫిబ్రవరి17

బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలతో కలసి మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మరియు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి

ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ అదినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప నేత కేసిఆర్

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా గత 9 సంవత్సరాల పాలనలో తెలంగాణని దేశంలో అభివృద్ధి పథంలో నిలబెట్టారు,వారు గొప్ప పరిపాలన దక్షకుడు

ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది,ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుంది హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతున్నారని, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు అని తొందర్లోనే మళ్ళీ మన కెసిఆర్ రే ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు

You may also like

Leave a Comment