Home తాజా వార్తలు కౌలాస్ నాలా ప్రాజెక్ట గేట్లు ఎత్తివేత

కౌలాస్ నాలా ప్రాజెక్ట గేట్లు ఎత్తివేత

by Telangana Express

బిచ్కుంద జులై 27:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సవర్గావ్ గ్రామం వద్ద గల కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయితో వరద నీటితో నిండుకోవడంతో ఇంకా వరద నీరు పుష్కలంగా వచ్చి చేరడంతో జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ సిందే ఇరిగేషన్ సి ఈ శ్రీనివాస్ తో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి పూజ చేసి రెండు గేట్ల ద్వారా,3794, క్యూసెక్కుల వరద గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు

వరద కెనాల్ పరిసర గ్రామాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ శాసనసభ్యులు హనుమాన్ సిందే అన్నారు కౌలాస్ నాలా పూర్తి సామర్థ్యం 458 మీటర్లు కాగా 457,60 మీటర్ల నీరు నిలువ ఉంచుతూ నీటి విడుదల కొనసాగుతుంది
ఈ సందర్భంగా ప్రాజెక్ట్, డి ఈ ఈ, శేఖర్ రావు, ఏ ఈ ఈ రవిశంకర్ గ్రామ సర్పంచ్ కిషన్ పవర్ ఎంపీపీ భర్త నీళ్లు పటేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్ జుక్కల్ మండల్ టిఆర్ఎస్ అధ్యక్షులు మాధవరావు దేశాయ్ మాజీ అధ్యక్షులు బొల్లి గంగాధర్ టిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment