మంచిర్యాల, జనవరి 27, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): బీసీ రిజర్వేషన్ ఉద్యమానికి కల్వకుంట్ల కవిత మద్దతు ఇస్తున్నందుకు బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం జన్నారం మండల నాయకుడు మాజీ ఎంపిటిసి రాగుల శంకర్ స్వాగతం పలికారు. శనివారం జన్నారం మండల పట్టణంలోని విలేకరుల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలుగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకుండా అనగ తొక్కుతూ వస్తున్న పార్టీల విధానాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఉద్యమం చేస్తున్నారన్నారు. దేశం మొత్తంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పడటానికి ఉద్యమించడానికి ముందుకు వస్తున్న కల్వకుంట్ల కవిత కు స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమం చేపట్టాలని గత ఏడాది పార్లమెంటు లో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించినప్పటికీ ఆ మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఏర్పడే విధంగా ఈనెల 31వ తేదీ నుండి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించి బీసీ కులాల వారిని రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా ఎదగడానికి ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ప్రయత్నించాలని కోరారు. బీసీ కులాలకు చెందిన దేశంలోని మొత్తం బిసి కులాల వారు ముందుకు వచ్చి ఉద్యమించడానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కె ఏ నరసింహులు, ఆడెపు నారాయణ, కడార్ల నరసయ్య, కోడూరి చంద్రయ్య, దాసరి శ్రీనివాసు, కస్తులాపురి నరేందర్, మూల భాస్కర్ గౌడ్, ఎం మన్మదా చారి, ముక్కెర మల్లేష్, దండెవేని శ్రీధర్, బీసీ సంఘ ఉద్యమ పోరాట నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ ఉద్యమానికి కల్వకుంట్ల కవిత మద్దతు
63