లేదంటే సాగునీటి కోసం రైతులతో ధర్నా చేపడతాం..
వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి
వీణవంక, జనవరి 12( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
వీణవంక గ్రామ రైతులతో కలిసి సర్పంచ్ నీల కుమారస్వామి శుక్రవారం కల్వల ప్రాజెక్టును సందర్శించి అనంతరం మాట్లాడుతూ…గత తెలంగాణ ప్రభుత్వంలో సాగు, త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని,సాగునీరు లేక ఒక్కొక్క రైతు 10- 15వేల రూపాయలు పెట్టి వాగులో బావులు తవ్వడం జరుగుతుందని,మండలంలోని 15 గ్రామాలకు వేల ఎకరాలు సాగునీరు అందించే ప్రాజెక్టు గండిపడి, కూలిపోయి ఇన్ని రోజులు గడిచిన కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి కూడా ప్రాజెక్టునుసందర్శించలేకపోయారని,రైతులకు భరోసా ఇవ్వలేదని,గతంలో తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ 70 కోట్లు ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం,కానీ అధికారులు స్పందించి రైతుల బాధను అర్థం చేసుకొని సాగునీరు అందించాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీల కుమారస్వామి తో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
