మంచిర్యాల, జులై 27, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎడతెరిపిలేని వానల వల్ల పై నుండి వరద తాకిడి ఎక్కువ కావడంతో కడెం ప్రమాద స్థాయిలో చేరుకుంది. గురువారం ఉదయం నుండి కడెం గేట్ల ఆయకట్టు పై నుండి నీరు అతివేగంతో ప్రవహిస్తుంది. దీంతో కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కుల ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల నీరు కడెం డ్యామ్ లో నిలువ ఉన్నది. కడెం ప్రాజెక్టుకు పూర్తి 18 గేట్లు ఉండగా 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయించడం జరుగుతుందని వాటి ద్వారా పూర్తి నీరు బయట వదిలేలా చూస్తామని ప్రాజెక్ట్ ఇంజనీర్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు ద్వారా దివగువకు నీరు వదలగా నది పరివాహక ప్రాంతాలు జనాలను సురక్షిత ప్రాంతాలకు మండల అధికారులు తరలించడం జరుగుతుంది. దీంతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని నది పరివాహ ప్రాంతాలైన కలమడుగు, ధర్మారం, బాదం పెళ్లి, చింతగూడ, తపాలాపూర్, రోటి గూడ, తిమ్మాపూర్, గ్రామాల జనాలను ఆ గ్రామ కార్యదర్శులు సర్పంచులు ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ మాట్లాడుతూ ఎగువ నుండి నీరు కడెం ప్రాజెక్టులోకి వరద రావడం వలన దిగువకు 18 గేట్ల ద్వారా నీటిని వదలడం జరుగుతుందని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో స్థానిక నాయకులు కార్యకర్తలు సహకరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కడెం ప్రాజెక్టు వద్ద ఉండి పూర్తి వివరాలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తెలియ పరచడం జరుగుతుంది.
ప్రమాద స్థాయిలో కడెం ప్రాజెక్టు
ఆయకట్టు పై నుండి ప్రవహిస్తున్న వరద నీరు
44
previous post