Home తాజా వార్తలు నర్వ మండలంలోని రాయికోడు గ్రామంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నర్వ మండలంలోని రాయికోడు గ్రామంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

by Telangana Express

ఏప్రిల్ 11( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
అంటరానితనం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన జీవితాన్ని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంకితం చేసిన మహాత్మా జ్యోతిబాపూలే 197 వ జయంతిని నేడు మన రాయికోడ్ గ్రామంలో ఘనంగా నిర్వహించటం జరిగింది.పూలే కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని
పూలే దంపతుల విగ్రహాలకు గ్రామపెద్దలు, యువకుల సమక్షంలో పూలమాలలు వేసి నివాళులర్పించటం జరిగింది.కుల,మత,వర్ణవిబేధాలు లేని సమసమాజ స్థాపనకు విశేష కృషి చేసిన జ్యోతిరావు పూలే జయంతిని మన గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవటం ఎంతో సంతోషకరమైన విషయం.
మహాత్ములు శ్రీమతి సావిత్రిబాయి, జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలు మన గ్రామంలో ఏర్పాటు చేసుకుని, వారిని స్మరించుకుంటూ,వారి ఆశయ సాధనకు సంకల్ప బీజం వేసి నేటికి ఏడాది పూర్తి అయింది. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ, వారు చూపిన జ్ఞాన మార్గంలో మనమంతా మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పూలే కమిటీ వ్యవస్థాపకులు,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు యం.శంకర్,గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కె.యన్.స్వామి,
ఎం.నారాయణరెడ్డి,గొల్ల మల్లేష్,డి.శ్రీనివాసులు, సత్యారెడ్డి,పి నర్సిములు,డి రాములు,కే రాఘవేందర్ గౌడ్,పుల్లరి రాజు,బి రవి కుమార్,పూలే కమిటీ సభ్యులు మ్యాతరి గోపాల్,ఉప్పరి రవి,ముస్టిపల్లి రామాంజనేయులు గౌడ్,వార్డు సభ్యులు రాము, యువకులు ఎన్ నర్సింలు,కే అనిల్, బి శివశంకర్,
ఎం అనిల్,అంజి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment