మంచిర్యాల, డిసెంబర్ 10, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఓటుతో ప్రజా ప్రభుత్వం అమల్లోకి తెచ్చారని, జన్నారం మండల అటో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు నశీరోద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల బస్ స్టాండ్ అవరణలో మాట్లాడుతూ ప్రవేట్ వాహనలైన అటో, టాటా ఎసి, జీబులు యాజమానుదారుల జీవనోపాధి మీద, రాష్ట్రంలో చేపట్టిన పతకాలలో ఒకటైన మహిళ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఆటో, టాటా ఏసీ, జీబుల నడుపుతూ జీవనం గడుపుతున్న వారిని, ప్రజా ప్రభుత్వం న్యాయం చేయాలని నిరసన తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వలన ప్రైవేట్ వాహనదారులు, ప్రయాణికులను ఒక చోట నుండి మరో చోటుకు చేరవేస్తూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఉపాధిని కోల్పోయి కుటుంబ పోసిన గడవడం కష్టమవుతుందన్నారు. ఆటో టాటా ఏసీ జీబుల వారికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల ఆటో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు నజీరోద్దీన్, మండల ఆటో యూనియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మార్పు చేసి ప్రజల తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి
62