మంచిర్యాల, అక్టోబర్ 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటించారు. శనివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల జెడ్పిటిసి కార్యాలయంలో జన్నారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులుి, కార్యకర్తలతో మాట ముచ్చట ఎమ్మెల్సీ విఠల్ నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి భుక్య జాన్సన్ నాయక్ ను, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ఖానాపూర్ నియోజకవర్గంలో బిఅర్ఎస్ పార్టీ గేలుపు కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ ను మండల జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, పిఎసిఎస్ చైర్మన్ శీలం రమేష్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, ముత్యం భాస్కర్, మున్వర్ అలీ ఖాన్, ఆనందం, భరత్ కుమార్, రాగుల శంకర్, నయనాల తిరుపతి, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మండలంలో పర్యటన
40
previous post