జడ్చర్ల, ఫిబ్రవరి 3: జనహృదయనేత,మాజీమంత్రి జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం జడ్చర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేట నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో బయల్దేరి పట్టణంలోని ముఖ్య కూడళ్ళలో నాయకులు, అభిమానులు ఏర్పాటుచేసిన కేక్ ను ఆయన తో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్ర గార్డెన్ కు చేరుకున్నారు.అక్కడ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పలువురు నాయకులు,కార్యకర్తలు, ఆయన అభిమానులు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు.జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మీ రవీందర్, కౌన్సిలర్లు,పలువురు ప్రజాప్రతినిధులు హాజరై లక్ష్మారెడ్డికి శాలువా కప్పి పూల మాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతకుముందు రాజాపూర్ మండలంలోని ఆయన జన్మదినన్ని పురస్కరించుకొని నాయకులు ఏర్పాటుచేసిన కేకును మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి చేత కేక్ కట్ చేయించి తినిపించారు.అనంతరం శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సుశీల,సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు,రాజాపూర్ మాజీ సర్పంచ్ కప్పెరి బచ్చిరెడ్డి,ఎక్స్ ఎంపీపీ హనుమ గళ్ళ నర్సింలు,కో ఆప్షన్ అల్తాఫ్ బేగ్, నాయకులు వెంకట్రావు, ఆనంద్ గౌడ్,కే బాల్రాజ్, యాదగిరి,తదితరులు శుభాకాంక్షలు తెలిన వారిలో ఉన్నారు.