- ఏఎంసి వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్
ఆమనగల్లు, నవంబర్ 27
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
జైపాల్ యాదవ్ గెలుపే కల్వకుర్తి ఇలవేల్పు అని ఆయనతోనే కల్వకుర్తి నియోజకవర్గం ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లే ఏకైక నాయకుడు జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 7,13,14 వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు విస్తృతంగా ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ ను, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకండమైన మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్, బిఅర్ఎస్ నాయకులు ఎనుమళ్ళ రమేష్, తల్లోజు రామకృష్ణ, వస్పుల సాయిలు, ప్రకాష్, యాలాల కుమారు, శశి, శేఖర్, మహబూబ్ కురేషి,చాంద్ పాషా, రమేష్, ఖాదర్, గుజ్జరి గోపి, అబ్బూ, ఇమ్మానియల్, శివ, యాదయ్య బిఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

