ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో, శుక్రవారం ఉదయం అయ్యప్ప మాలాధారణ చేసిన నలుగురు స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని, గురుస్వామి హ్యన్మంతప్ప స్వామిచే, ఆలయ పూజారి శ్రీనివాస్ రావు సమక్షంలో ఇరుముడి కట్టుకుని నెత్తిన పెట్టుకొని, పదునెట్టంబడి పడిని వెలిగించి, ఆలయంలో స్వామివారికి ప్రదక్షణలు చేసి, వాహనంలో శబరిమలకు బయలు దేరి వెళ్ళారు. స్వాములకు కుటుంబ సభ్యులు, మలాధార స్వాములు ఘనంగా వీడ్కోలు పలికారు. శబరిమలకు తరలిన వారిలో పుట్టి గోపాల్ గురు స్వామి, డాక్టర్ ఉపేం దర్ స్వామి, డాక్టర్ అరుణ్ స్వామి, మరో స్వామి, తదితరులు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో అనిల్ స్వామి, మాలధార స్వాముల కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.
