Home తాజా వార్తలు తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.

తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.

by Telangana Express
      - ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు 

ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కలశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, ప్రిన్సిపాల్ జి. నాగేశ్వర్ రావు, శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్, పిజిటి ఆంగ్లం, పిజిటీ ఫిజికల్ సైన్స్ అధ్యాపక పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో
50 శాతం మార్కులతో పీజీ, సంబంధిత సబ్జెక్ట్స్ తో బీఈడీ పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఈ నెల 30 న సోమవారం ఉదయం 10.00 గంటలకు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల నందు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ జి. నాగేశ్వరరావు కోరారు.

You may also like

Leave a Comment