Home తాజా వార్తలు మైనార్టీ గురుకుల బాలుర 1 కళాశాలలో ప్రథమ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ గురుకుల బాలుర 1 కళాశాలలో ప్రథమ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Telangana Express

ఫిబ్రవరి 6 వరకు అవకాశం….
– ప్రిన్సిపాల్ సయ్యద్ మసూద్ అహ్మద్

ఎల్లారెడ్డి, జనవరి 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక మైనారిటీ గురుకుల బాలుర 1 కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను, ఇంటర్ మొదటి సంవత్సరంలో సి ఈ సి, ఎం ఈ సి ఆంగ్ల మాధ్యమం కోర్సుల్లో ప్రవేశాలకు, ఆన్లైన్ ( టీఎంఆర్ఈఐఎస్ తెలంగాణ.సిజిజి.జీవోవి.ఇన్) సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ మసూద్ అహ్మద్, శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సి ఈ సి, ఎం ఈ సి లలో ఒక్కో గ్రూప్ లో 40 సీట్లకు గాను 30 సీట్లు మైనారిటీలకు,10 సీట్లు నాన్ మైనార్టీలకు (ఎస్సీ – 2, బిసి -5, ఎస్టీ – 2, ఒసి – 1 ) కేటాయించడం జరుగుతోందన్నారు. దరఖాస్తులు జనవరి 18 నుంచి ప్రారంభం అయ్యాయని ఫిబ్రవరి 06, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 8328123773, 9908803968 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ప్రిన్సిపాల్ సయ్యద్ మసూద్ అహ్మద్ తెలిపారు. ఈ అవకాశాన్ని మండల పరిధిలోని మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

You may also like

Leave a Comment