Home తాజా వార్తలు కె యన్ యం డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం

కె యన్ యం డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం

by Telangana Express

మిర్యాలగూడ డివిజన్ ఫిబ్రవరి 21 తెలంగాణ ఎక్స్ ప్రెస్/ కేయన్ యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం మరియు యన్ యస్ యస్ యూనిట్ వన్ మరియు టు అధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం కళాశాల ప్రిన్సిపాల్ డా. బిక్షమయ్య అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. బిక్షమయ్య గారు మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణ ప్రథమ కర్తవ్యం అని ఈ సంవత్సరం “బహుభాషా విద్యను ఆవశ్యకత” లక్ష్యంగా తీసుకోవాలని ప్రపంచంలో ఉన్న 6700 భాషలలో ఉత్తమమైన తమ మాతృ భాష ద్వారా తమ భావాలను అభిప్రాయాలను వెళ్లిబుచ్చుకోవాలని అన్నారు మరియు వివిధ దేశాలలోని విభిన్నమైన సంస్కృతులను జీవన విధానాలను ,ఆచార్య వ్యవహారాలను ,ఆయా దేశాల చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని మిగతా ప్రపంచానికి తెలియజేయడానికి భాష ఒక వారధి లాంటిదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్యు ఏ సి కోఆర్డినేటర్ ఈ రామ్ రెడ్డి ,అకాడమిక్ కోఆర్డినేటర్ టి వెంకటరమణ , ,ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యన్ కోటయ్య, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ టు ప్రోగ్రామ్ ఆఫీసర్ జె నరేందర్ రెడ్డి, బోధన,బోధనేతర సిబ్బంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ , విద్యార్దిని,విద్యార్దులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment