Home తాజా వార్తలు అంతర్జాతీయ ఆటో కార్మిక దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ ఆటో కార్మిక దినోత్సవ వేడుకలు

by Telangana Express

మంచిర్యాల, ఆగస్టు 01, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): అంతర్జాతీయ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా ఆటో కార్మిక డ్రైవర్లు సంగం అధ్యక్షుడు పులి రాజేందర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించుకున్నారు. మంగళవారం ఆటో యూనియన్ సభ్యుల అందరి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటు డ్రైవర్ గా ఉంటూ ప్రయాణికుల అవసరాలను తీర్చడం కోసం నిత్యం బస్టాండ్ సమీపంలో, మార్కెట్ ఏరియాలో, షాపింగ్ మాల్, ప్రభుత్వ కార్యాలయం సమీపంలో ఉంటున్నామన్నారు. ప్రయాణికుల అత్యవసర దూరాలను అది సమీపంలో తీసుకువెళ్లి వారి అవసరాలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మంచిర్యాల నియోజక వర్గంలో ఉన్న ఆటో కార్మిక సోదరులు అందరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు, విక్రమ్, చక్రి, మిత్రం, రాజు, తిరుపతి, సాగర్, సత్తయ్య, ఇప్ప శంకర్, శ్రీను పాల్గొన్నారు. జన్నారం:- మండలంలోని గుడిమడుగు గ్రామంలో ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవం సంబరాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ మండల ఉపాధ్యక్షుడు రత్నం మాణిక్యం ఆధ్వర్యంలో జరిగిందన్నారు. జిల్లాకు చివరలో ఉన్న మండలమైన జన్నారం నుండి మారుమూర గ్రామాల నుండి ఆటో ద్వారా ప్రయాణికులను వారు చేరుకునే ప్రదేశానికి చేరవేయడం జరుగుతుందన్నారు. ఆటోలు ప్రయాణికులను ఎంత కష్టమైనా వారి చేరుకున్న దూరాన్ని చేరవేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మురిమడుగు గ్రామం ఆటో యూనియన్ అధ్యక్షుడు నర్సింలు, గంగన్న, రాజేందర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment