విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా, ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి…
యుఫ్ టి వి సీఈఓ పాడి ఉదయ నందన్ రెడ్డి..
వీణవంక, ఫిబ్రవరి 27( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు నేటి నుండి – మార్చి 19 వరకు మీకు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతున్నాయి. కావున ఇంటర్మీడియట్ పరీక్షల గురించి ఆందోళన చెందకండి, మీ జీవితంలో ఇలాంటి ఎన్నో బోర్డు పరీక్షలు వస్తాయి మీరు హాజరవుతారు. కావున ఒత్తిడిని విద్యార్థులు అడగమించాలి. విద్యార్థులు ఎవరైనా మానసిక ఒత్తిడికి గురి అయితే ఈ టోల్ ఫ్రీ 14416 నెంబర్ కి ఫోన్ చేయండి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. వారు మీకు నూతన ఉత్తేజాన్ని పొందడానికి సలహాలు సూచనలు చేస్తారు కావున మీకు ఒత్తిడి తగ్గుతుంది. సంవత్సరం పాటు ఎదురుచూస్తున్న పరీక్షలు వచ్చేసాయి ఇదంతా సంతోషంగా జరుపుకునే పండుగ లాంటిది.అని మీరు భావించాలి. ఈ పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించాలి ఇది మీ పరీక్షల సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం పెంచుకోండి వ్యూహాత్మక ప్రణాళికను అనుసరించి పేపర్ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వండి. మీ పరీక్ష పేపర్ కఠినంగా వచ్చినప్పుడు భయపడి ఒత్తిడికి లోనైతే విలువైన సమయాన్ని కోల్పోయే పొరపాటు చేయకండి. ప్రశ్నాపత్రం చదివాక, బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు, చక్కని హ్యాండ్ రైటింగ్ తో రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ కావున అంటే ముందు రాసిన సమాధానాలు బట్టి దిద్దేవారు మీ తెలివితేటలు అంచనా వేస్తారు కావున మీకు మొదటగా మీకు వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి.అది పరీక్షల్లో ముఖ్యంగా ప్రశ్న చదువుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండండి టెన్షన్ తో చదవకూడదు. ఆ సమయంలో టెన్షన్ వస్తే కన్ఫ్యూషన్ రావచ్చు, దాని వలన పరిశీలన అవగాహన మారుతుంది అందుకే టెన్షన్ రాకుండా చూసుకోండి. మీలోని భయం అంతా అర్థం లేనిది ఈ భయం పోవాలంటే ఆత్మవిశ్వాసం అవసరం నేను పరీక్షలు బాగా రాయగలుగుతాను తప్పకుండా నేను అనుకున్న ర్యాంకు నాకు వచ్చి తీరుతుంది. దానికి కావలసిన ధైర్యం నాకుంది అనే పదేపదే మీకు మీరే సెల్ఫ్ హిప్నాటిజం చేసుకోవాలి. విలువైన సమయాన్ని సమర్థవంతంగా ఎలా పరీక్ష సమయంలో ఎలా రాయడానికి ఉపయోగించుకోవాలి. తెలుసుకొని మీకు మీరే ప్రేరణ పొందండి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందండి. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో పై చదువులు కోసం వెళ్లడానికి మంచి అవకాశం ఉంటుందని, యుఫ్ టి వి సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి తెలియజేశారు.