ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 29,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు పరీక్షలు సిఎస్ హేమచందర్ ను అడిగి తెలుసు కున్నారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన మౌలిక వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హేమచంద్ర, స్థానిక తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.