Home తాజా వార్తలు ఆస్థి పన్ను పై వడ్డీని మాఫీ చేయాలి-మహేష్ యాదవ్

ఆస్థి పన్ను పై వడ్డీని మాఫీ చేయాలి-మహేష్ యాదవ్

by Telangana Express

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12(తెలంగాణ ఎక్సప్రెస్ ):

గత నాలుగు సంవత్సరాలు నుంచి కరోనా కారణంగా మధ్యతరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని సర్కిల్లో ఆస్తి పన్నుపై వడ్డీ నీ పూర్తిగా మాఫీ చేయవలసిందిగా కోరుతూ జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ను హాఫిజ్ పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ కలిసి వినతి పత్రం సమర్పించారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలు, పనుల్లెక, వ్యాపారాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని, వీరి ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయి, వడ్డీని మాఫీ చేసేవిదంగా చూడాలని కోరారు.

You may also like

Leave a Comment