Home తాజా వార్తలు నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభo

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభo

by Telangana Express


ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి…
నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలో అనుమతించం…
– పరీక్ష కేంద్రాల సీ ఎస్, డీ ఓ లు

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఇంటర్మీడయట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఎ) , ఆదర్శ పాఠశాల/కళాశాల (బి ) పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్. హే మచందర్, పి.సాయిబాబా, స్వప్న , పద్మ లు, మంగళవారం తెలిపారు. బుధవారం నుంచి జరుగనున్న తెలుగు, హిందీ, ఉర్దూ , సంస్కృతం, జి ఎఫ్ సి ఇంటర్ ప్రథమ పరీక్షకు ఏ కేంద్రంలో 289, బి కేంద్రంలో 255 మంది విద్యార్థులు, పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థుల హల్టికెట్ నంబర్లను బెంచిల మీద వేసి సిద్దం చేయడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతోందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 8 గంటల వరకు చేరుకోవాలని, 8.30 గంటల నుంచి పరీక్ష గదుల్లోకి స్క్రీనింగ్ చేసి పంపించడం జరుగుతుంది అని తెలిపారు. 9.00 గంటలు దాటి నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాలలో అనుమతించడం జరగదని వారు స్పష్టం చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. పరీక్షల కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంటారని సీఎస్, డీఓ లు తెలిపారు.

You may also like

Leave a Comment