Home తాజా వార్తలు 9 వ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం….రెండు కేంద్రాల్లో కలిపి 20 మంది గైర్హాజరు. పరీక్ష కేంద్రాల సీఎస్ డీఓ లు

9 వ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం….రెండు కేంద్రాల్లో కలిపి 20 మంది గైర్హాజరు. పరీక్ష కేంద్రాల సీఎస్ డీఓ లు

by Telangana Express

ఎల్లారెడ్డి, మార్చి 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల “ఎ”, ఆదర్శ కళాశాల “బి” పరీక్ష కేంద్రాల్లో, సోమవారం నాడు 9 వ రోజు ఇంటర్ ప్రథమ సంవత్సర పార్ట్ 3, ఫిజిక్స్ 1, ఎకనామిక్స్ 1, (వొకేషనల్) ( సెట్ “ఏ”) పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్.హేమచందర్, పి.సాయిబాబా, స్వప్న, పద్మ లు తెలిపారు. ఏ కేంద్రంలో 261 మందికి 258 మంది హాజరు కాగా 03 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. వొకేషనల్ 39 మంది విద్యార్థులకు 34 మంది పరీక్షలకు హాజరు కాగా 5 గురు గైర్హాజరయ్యారు. “బి” కేంద్రంలో 272 మందికి గాను 260 మంది పరీక్షకు హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి 20 మంది విద్యార్థులు గైహాజరైనట్లు సీఎస్, డీఓ లు తెలిపారు. పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా , ఒక్కో విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోనికి పంపించి, పక డ్బందీగా పరీక్ష నిర్వహించడం జరిగిందని సిఎస్, డి ఓ లు తెలిపారు.

You may also like

Leave a Comment