ఎల్లారెడ్డి, డిసెంబర్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఆదివారం 6 వ రోజు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న కేజిబీవీ, ఎం ఆర్ సి సమగ్ర శిక్ష ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి నిరవధిక సమ్మె లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డి.సత్యనారాయణ మాట్లాడుతూ, తమకు రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా 5 లక్షలు, పిటీఐ లకు 12 నెలల వేతనం , మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని, 61 ఏండ్లు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలని, మరణించిన ఉద్యోగులకు 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు నిరవధిక సమ్మెను విరమించబోమని జిల్లా అద్యక్షులు స్పష్టం చేశారు. ఈ నిరవధిక సమ్మె లో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ సంపత్ కుమార్, కోషాధికారి భాను ప్రసాద్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
