Home తాజా వార్తలు 18 వ రోజు కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె…భిక్షాటన చేసి నిరసన తెలిపిన ఉద్యోగులు…

18 వ రోజు కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె…భిక్షాటన చేసి నిరసన తెలిపిన ఉద్యోగులు…

by Telangana Express

నిరవధిక సమ్మె లో పాల్గొన్న కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది…

ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు, శుక్రవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు డి.సత్యనారాయణ తో పాటు కేజిబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎం ఆర్ సి ఉద్యోగులు ర్యాలీగా ఫ్లకార్డులు పట్టుకుని పండ్ల దుకాణాలు, మెకానిక్ షాపుల్లో, కిరణ దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ….తమకు రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా 5 లక్షలు, పిటీఐ లకు 12 నెలల వేతనం, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. ఎంగెజీ పేరుతో తమ బతుకులను అంధకారంలోకి నెట్టవద్దని అన్నారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు, సెక్రటరీ సంపత్ కుమార్, కోషాధికారి భాను ప్రసాద్, ఉద్యోగులు , తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment