Home తాజా వార్తలు నాల్గవ రోజు కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె….వినూత్నంగా బతుకమ్మలతో పాల్గొన్న మహిళా సమగ్ర శిక్ష ఉద్యోగులు….మూతబడ్డ ఎం ఆర్ సి లు…

నాల్గవ రోజు కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె….వినూత్నంగా బతుకమ్మలతో పాల్గొన్న మహిళా సమగ్ర శిక్ష ఉద్యోగులు….మూతబడ్డ ఎం ఆర్ సి లు…

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 13,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత కోసం, జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం నాల్గవ రోజున జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న కేజిబీవీ, ఎం ఆర్ సి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె లో పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు వినూత్నంగా బతుకమ్మలతో పాల్గొన్నారు . ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డి.సత్యనారాయణ మాట్లాడుతూ, తమకు రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టిపీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి గత ఏడాది హన్మకొండలో సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి, అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఏడాది దాటి పోయిందని అన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టు కుంటారనే పూర్తి విశ్వాసంతో ఉన్న తమకు, ఎలాంటి హామీ ఇవ్వక పోవడంతో రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకుల అదేశాల మేరకు ఈ నెల 10 వ తేది నుండి నిరవధిక సమ్మెను కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేస్తున్నామని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఎంఆర్ సి కార్యాలయానికి విధులకు వెళ్లకుండా నిరవధిక సమ్మె లో పాల్గొనడంతో ఎం ఆర్ సి కార్యాలయాలు తీసేవాళ్ళు లేక తాళాలు పడ్డాయి. రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు నిరవధిక సమ్మెను విరమించబోమని జిల్లా అద్యక్షులు స్పష్టం చేశారు. ఈ నిరవధిక సమ్మె లో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ సంపత్ కుమార్, కోషాధికారి భాను ప్రసాద్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment