ఎల్లారెడ్డి, జనవరి 1,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
పెంచిన హమాలీ రేట్ల జి ఓ ను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ… బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్ ఎల్ ఎస్ పాయింట్ సివిల్ సప్లైస్ హామలీలు ఏ ఐ టి యు సి అధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ అద్యక్షులు కె.సాయిలు మాట్లాడుతూ….గత ఏడాది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ యూనియన్ నాయకులతో చర్చించి , హమాలీ రెట్లు క్వింటాలుకు ఎగుమతి, దిగుమతికి 26 రూపాయల నుంచి 29 రూపాయలకు పెంచడం జరిగింది. పెంచిన హమాలీ రేట్లను 2024 జనవరి నుంచి పెంచిన ఏరియర్స్ తో చెల్లించాలి , ప్రతి దసరాకి ఇస్తున్న, స్వీట్లు, బోనస్, యూనిఫాం, కుట్టు కూలి నేటి వరకు ఇవ్వలేదని, జిఓ రావడానికి ఆలస్యం కావడంతో గత ఏడాది ఇచ్చినట్లు ఇవ్వాలని కోరడం జరిగింది. పెంచిన హమాలీ రేట్ల జీ ఓ రాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ అద్యక్షులు కె.సాయిలు, ఉపాధ్యక్షులు కాశారాం, కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీకాంత్, సభ్యులు నరేష్, రాములు, ప్రభాకర్, బాబు , అల్లు, స్వీపర్ పోచవ్వ తదితరులు పాల్గొన్నారు.