నిజాంసాగర్ జనవరి 16,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారుచేయించిన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ ను సోమవారం కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దపేదర్ శోభ రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ కు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ దంపతులకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా సత్కరించి మిఠాయి వినిపించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.పూర్ణచంద్రోదయ కుమార్,జనరల్ సెక్రెటరీ డి.విఠల్,సిసి బి.గంగాప్రసాద్, రఘు, బీ.పీరులాల్ నాయక్, ఎన్.కిషన్ రావు,ఎన్ రవికాంత్,ఎన్ నరేష్, ఎన్.దేవరావు,ఖలీల్,ఏ రమేష్ కుమార్,అబ్దుల్ రషీద్ వెంకటరామిరెడ్డి,ఎ.అరుణ్, షేక్ వహాబ్,తాహర్ అలీ తదితరులు పాల్గొన్నారు.