మంచిర్యాల, ఫిబ్రవరి 20, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట వద్ద నిర్వహించే గాంధారి మైసమ్మ జాతర కరపత్రాలను, ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు భూమేష్ ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 23, 24, 25 లలో గాంధారి మైసమ్మ జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట సమీపంలో గాంధారి మైసమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయక పోడు యూత్ అధ్యక్షుడు ఆసునూరి ప్రభాకర్ తిమ్మాపూర్, నాయకులు సాదు, చిన్నయ్య, పిట్టల రాజన్న, తట్ర రమేష్, పిట్టల భూమేష్, ఆసునూరి ఎంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 23 24 25 లలో గాంధారి మైసమ్మ జాతర కరపత్రాలు ఆవిష్కరణ
79
previous post