- పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు.
- అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
– ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.- పునరావాస కేంద్రాలను ఏర్పాటు ..- వర్షాలతో చెరువులు, కుంటలు జలకళ…- నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి..- రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్.మహబూబాబాద్,ప్రతినిధి న్యూస్ జూలై26(తెలంగాణ ఎక్స్ ప్రెస్):-భారీ వర్షాలు నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని జమాండ్లపల్లి నెల్లికుదురు మండలంలోని వావిలాల రావిరాల నెల్లికుదురు మండలం కాచికల్ తొర్రూరు మండలం మడిపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న ఆకేరు వాగు వరద ప్రవాహాన్ని మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారుల తో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షింస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాదానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులకు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. శిథిలావస్థ ఇండ్లలో ఎవరు ఉండకూడదని వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అన్ని పీ.హెచ్.సీలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, గర్భిణీలను సైతం పిహెచ్ సి లకు తరలించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లవద్దని హితవుపలికారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకునే విధంగా చెరువులను పునరుద్ధరించారని స్పష్టం చేశారు. దీంతో చెరువులు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయని తెలిపారు.వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా, భూగర్భ జలాలు పెరిగాయని, బోర్లలో నీటి నిల్వలు పెరిగాయని పేర్కొన్నారు.నా తెలంగాణ కోటి రతణాల వీణ అని దాశరథి అంటే.. నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి.. అని సీఎం కేసీఆర్ నిరూపించారని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇతర అధికారులు బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.