Home తాజా వార్తలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

by Telangana Express

రణపంగ కృష్ణ

పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 14 తెలంగాణ ఎక్స్ ప్రెస్

.కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న. రైతు. కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 16న జరిగే దేశ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చీదేల గ్రామంలో మంగళవారం సిఐటియు. రైతు సంఘం. వ్యవసాయకార్మిక సంఘాల .ఆధ్వర్యంలో సంబంధిత కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగకృష్ణ పాల్గొని మాట్లాడుతూ దళితులు గిరిజనులు మైనార్టీ మహిళలపై దాడులను అరికట్టాలని సామాజిక న్యాయం అమలు చేయాలని అందరికీ గృహ వసతి కల్పించాలి ప్రభుత్వ సంస్థల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని ధరలు పెరుగుదలను అరికట్టాలి ఆహార వస్తువులను నిత్యవసర వస్తువులపై జిఎస్టి ఉపసమరించుకోవాలి పెట్రోల్ డీజిల్. కిరోసిన్. వంట గ్యాస్ లపై కేంద్రం ఎక్స్చేంజి సుమకం తగ్గించాలని ప్రజా పంపిణీ వ్యవస్థ పిడిఎస్ విస్తరించాలి 14 రకాల నిత్యవసర వస్తువులను అందించాలని ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు. రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుర్రం గోపాల్ రెడ్డి. కొండమీది రాములు. బొమ్మిరెడ్డి గోపిరెడ్డి .నల్లబెల్లి వెంకటరెడ్డి. వెంకన్న. శీను .తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment