Home తాజా వార్తలు మండలంలో అమలు కానీ ఎన్నికల కోడ్

మండలంలో అమలు కానీ ఎన్నికల కోడ్

by Telangana Express

విచ్చల విడిగా పలు గ్రామాల్లో డబ్బులు పంచుతూ తిరుగుతున్న పట్టించుకోని అధికారులు

మంచిర్యాల, నవంబర్ 29, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఎన్నికల కోడ్ అమలు కాలేదని పలు గ్రామాల మండల వాసులు అనుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాలలో డబ్బులు పంచుతూ విచ్చలవిడిగా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం జరుగుతలేదని ప్రజలు అనుకుంట్టూన్నారు. మండలంలో పలు గ్రామాలలో చుట్టేసి ఓటరు ఒక్కంటికి 500 రూపాయలు చొప్పున పంచరాని ఊళ్ళలో ప్రజలు అనుకుంటున్నారు. కొన్ని కొన్ని గ్రామాలలో డబ్బులు మంచివారు రాలేదని గుసగుసలాడుకుంటున్నారు. జన్నారం మండలంలో 29 గ్రామపంచాయతీలో ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల పంచాయతీల ప్రజలు ఆ గ్రామానికి డబ్బులు పంచడానికి రాలేదని అనుకుంటున్నాను. డబ్బులు మద్యం ఆశ చూపి ఓటర్లను మభ్యపెట్టకూడదని అధికారులు తెలుపుతున్నారు. ఎన్నికల కోడ్ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి డిసెంబర్ ఒకటి ఉదయం ఏడు గంటల వరకు 144 సెక్షన్ ఉండి గుంపులు గుంపులుగా ఉండరాదని ఎన్నికల కోడ్ ఆదేశించింది. ఇప్పటికైనా జన్నారం మండల పోలీసులు బుధవారం రాత్రి నిఘా పెట్టి గ్రామాల్లో డబ్బులు పంచకుండా చూసుకోవాలని పలువురు ప్రజలు కోరుకుంటున్నారు.

You may also like

Leave a Comment