నిర్మల్ జూలై26 తెలంగాణా ఎక్స్ ప్రెస్ (జిల్లా ప్రతినిధి); శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంత వారైనా ఉపేక్షించేది లేదని ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం కోర్బాగల్లీ, గుజిరిగల్లీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. అల్లర్లు, ఘర్షణలు, అభివృద్ధికి ఆటంకిగా నిలుస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొవాలన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు అన్ని గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాశాలు రెచ్చగొట్టె పోస్టులను పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సరైన పత్రాలు లేని 88 బైక్లు, 2 టాటా వాహానాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ ఎల్ శ్రీనుతో పాటు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్
42