Home తాజా వార్తలు అక్రమ ఇసుక రవాణా చేస్తే ,డ్రైవర్, యజమానులపై కఠిన చర్యలు తప్పవు

అక్రమ ఇసుక రవాణా చేస్తే ,డ్రైవర్, యజమానులపై కఠిన చర్యలు తప్పవు

by Telangana Express

వీణవంక ఎస్సై వంశీకృష్ణ.

వీణవంక, జనవరి 12(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతి నిది ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండల ఫరిది లో శుక్రవారం గ్రామాలలో విలేజ్ పెట్రోలింగ్ డ్యూటీ చేయుచుండగా, ఉదయం 6:15 నిమిషములకు ఎల్బాక గ్రామ శివారులోకి చేరుకొనే,సరికి ఎదురుగా టీఎస్ 23 టీ 1539/1540 గా గల ట్రాక్టర్ ఇసుకతో లోడ్ తో రాగా, అట్టి ట్రాక్టర్ డ్రైవరును ఇసుక రవాణా చేయుటకు ఏమైనా అనుమతి పత్రాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా ఏమి లేవని దొంగతనంగా, మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామ మానేరు వాగు లో నుండి తీసుకొని పోయి అమ్మికుంటున్నానని చెప్పగా అట్టి ట్రాక్టర్ ను డ్రైవర్ ను పోలీసు స్టేషన్ కు తీసుకొని వచ్చి డ్రైవర్, మరియు ఓనర్ అయిన కొమిరే ప్రణయ్, వంశీ లు నివాసం వేగురుపల్లి గ్రామ వ్యక్తులపై కేసు నమోదు చేయనైనది.మండల ఫరిధిలో గల గ్రామాల కు చెందిన ట్రాక్టర్ యజమానులు ఎవ్వరైనా అక్రమ ఇసుక రవాణా చేసిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడునని, వీణవంక ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

You may also like

Leave a Comment