మృతురాలి కుటుంబానికి పదవేల రూపాయల ఆర్థిక సహాయం..
వీణవంక, జనవరి 20 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
వీణవంక మండల కేంద్రంలో ఇటీవల మరణించిన రెడ్డిమల్ల నాగమ్మ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాల కులస్తులు అందజేశారు. ఇకనుండి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరిగిందని ఇట్టి కార్యక్రమాన్ని కి సహకరించిన ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు అని మాల సంఘం అధ్యక్షులు వోరెం రవీందర్ అన్నారు . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వోరెం భానుచందర్ , ఉపాధ్యక్షులు భోగం శ్రీజన్ , ప్రధాన కార్యదర్శి వోరెం సురేష్ , వుప కార్యదర్శి వోరెం అభిషేక్ , క్యాషియర్ రెడ్డి మల్ల రమేష్ , గౌరవ సలహాదారుడు వోరెం సాగర్ , మీడియా కన్వీనర్ కడబండ ప్రవీణ్ కుమార్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాదాసి సునీల్, వోరెం మధు , సమిల్ల చిట్టి , వోరెం ప్రవీణ్ అర్ టి సి , వోరెం నారాయణ , సలహాదారులు భోగం శ్రీను, తదితరులు, పాల్గొన్నారు.