Home తాజా వార్తలు పోచారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

పోచారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

by Telangana Express

ఘట్కేసర్ మార్చ్ 14(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలతో పాటు, క్రాంతి యూత్, బంజారా యూత్, పోచారం, ఎల్ఐజి సొసైటీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అన్నోజిగూడలోని ఎస్ బీ ఆర్ గార్డెన్ లొ బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఘట్కేసర్ రైతు సహకార సంఘం వైస్ చైర్మన్ బద్దం అనంతరెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు యం.కిషన్ నాయక్ తో పాటు 250 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గం ఇన్ చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, బి బ్లాకు అధ్యక్షుడు మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్, కొంతం శంకర్ రెడ్డి, ఎన్ సుధాకర్, నరేష్, శ్రీశైలం, సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment