ముధోల్:23మార్చ్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా హోలీ పండుగను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కామ దహనం చేసి మంటలు చుట్టూ విద్యార్థులు తిరుగుతూ కేరింతలను కొడుతూ ఆటలు ఆడారు.అనంతరం విద్యార్థులు ఒకరినొకరు సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు సారథి రాజు హోలీ పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ఆచార్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.
శిశు మందిర్ పాఠశాలలో హోలీ సంబరాలు
64
previous post