Home తాజా వార్తలు హిందూ ముస్లిం ఏక్ హో జైహో జైహో సబ్ హిందుస్తానీ ఏక్ హో

హిందూ ముస్లిం ఏక్ హో జైహో జైహో సబ్ హిందుస్తానీ ఏక్ హో

by Telangana Express
  • ఆదివారం జరిగే జైహో సమావేశాన్ని విజయవంతం చేద్దాం

ఆమనగల్లు, జనవరి 20
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో హిందూ-ముస్లిం ఐక్యత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన అశ్వఖుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ డిసెంబర్ 19 నాడు చనిపోయిన రోజు నుండి జనవరి 30 గాంధీ మహాత్ముని చనిపోయిన రోజు వరకూ జరికే సమైక్యత దినాలుగా పాటిస్తూ అన్ని ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జై భారత్ రాష్ట కార్యదర్శి రాజు అన్నారు.
జైహొ ఆమనగల్లు మండల అధ్యక్షులు జహంగీర్ పాషా మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యత అనేది దేశానికి చాలా అవసరమని ఆయన అన్నారు. గాంధీ, గఫార్ ఖాన్, వివేకానంద, నేతాజీ, ఉద్ధం సింగ్ మహనీయుల బాటలో నడుద్దాం అని ఆదివారం నాడు మధ్యాహ్నం 3గం, లకు పోస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్న మస్జీద్ దగ్గర జరిగే కార్యక్రమానికి అందరూ పాల్గొని జైహో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు . ఈ కార్యక్రమంలో జహంగీర్ పాషా, శివ, అలీం, హరి కృష్ణ, వినోద్, జావేద్, మున్నా , తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment