*10వ తరగతి విద్యార్థులకు*
*తన సొంత ఖర్చుతో స్టడీ మెటీరియల్ ని అందజేసిన తోట నరేంద్ర బాబు*
లోకేశ్వరం డిసెంబర్ 13
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్మల్ జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షుడిగా మరియు పుస్పూర్ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విద్య బోధనను అందిస్తూ విద్యార్థులు ఉన్నంత స్థానాలకు ఎదిగేందుకు తమ వంతు చేయూత గా ఉపాధ్యాయులు నరేంద్ర బాబు, తన సొంత ఖర్చులతో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు ఈ సమాజంలో జీవితాలను మార్చేది ఒక చదువేనని చదువు చాలా గొప్పదని దానికి కులం, మతం, జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ కళావతి, ప్రధానోపాధ్యాయులు ఎస్. చంద్ర ప్రకాష్ గౌడ్, ఏ. చంద్రకాంత్, ఎం.అశోక్, జై. రాజశేఖర్, ఓ. ముత్తన్న, వి. మధుకర్, సిహెచ్. నాగన్న,మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
