Home తాజా వార్తలు హసన్ పల్లిలో ఘనంగా ముగ్గులపోటీలు

హసన్ పల్లిలో ఘనంగా ముగ్గులపోటీలు

by Telangana Express

నిజాంసాగర్ జనవరి 16,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకోని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ యువ నాయకుడు నిఖిల్ సొంత డబ్బులతో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ ఐ రాజశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీ కోటి జయ ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు,బాలికలు ముగ్గులు వేసేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. ముగ్గులను న్యాయ నిర్ణీతలు పరిశీలించి ప్రధమ ద్వితీయ బహుమతులు ఎంపిక చేశారు.మొదటి బహుమతి సుంకే స్వాతి 3వేలు దక్కించుకోగా, ద్వితీయ బహుమతి మేకల వినోద 2వేలు దక్కించుకున్నారు.

విజేతలకు నగదు తో పాటు మెమోరండంను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుచీకోటి జయప్రదీప్,ఎస్ఐ రాజశేఖర్ చేతులమీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంక్రాంతి పండుగ రోజు ముగ్గుల పోటీలు నిర్వహించిన గ్రామ యువ నాయకుడు నిఖిల్ ను అభినందించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి సహకరిస్తే నలుగురికి ఉపయోగపడతాయని ఇందుకుగానుప్రజలు, మహిళలు, యువకులు, సహాయ సహకారాలు అందించాలన్నారు. మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్ జోషి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంక గౌడ్, కుర్మా వెంకట్ రాములు, మంగలి రాములు,బోయిని హరిన్ కూమర్,గూల లక్ష్మన్, గుల్లనారాయణ,బంజ ఆగమప్ప,బోయినిమొగులయ్య,గరబోయిన సాయిరాం,బోయిని సాయిలు,హరిజన్ దుర్గయ్య, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment