ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 22, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఒకే కాన్పులో ఒకే పోలికతో జన్మించిన పిల్లల తల్లి తండ్రులు , గురువారం కవలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కవల పిల్లలు ఉన్న తల్లి తండ్రులు తమ పిల్లలకు ఒకే రకం దుస్తులు దరింప జేసి స్వీట్లు తినిపించి ఉల్లాసంగా గడిపారు. కవల పిల్లలకు ఇద్దరి మధ్య ఎలాంటి భేదం చూపకుండా ప్రతి సారి ఒకే రకం దుస్తులు కొనడం, ఒకే రకం స్కూల్ బ్యాగులు కొనడం అలవాటుగా మారిపోయిందని, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22 వ తేదీన కవలల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని కవల పిల్లల తల్లితండ్రులు పట్టెం ప్రసాద్, తాటిచెట్టి శ్రీనివాస్ దంపతులు తెలిపారు.